‘కొబ్బరిమట్ట’ నుండి వరల్డ్ రికార్డ్ ట్రైలర్ !

‘కొబ్బరిమట్ట’ నుండి వరల్డ్ రికార్డ్ ట్రైలర్ !

Published on Jul 28, 2019 4:34 PM IST

రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా వస్తోన్న సినిమా ‘కొబ్బరిమట్ట’. కాగా తాజాగా ఈ సినిమా నుండి వరల్డ్ రికార్డ్ ట్రైలర్ పేరుతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఓ ట్రైలర్ రిలీజ్ కానుంది. ట్రైలర్ లో సంపూర్ణేష్ బాబు సింగిల్ టేక్ లో మూడున్నర నిముషాల పాటు డైలాగ్ ఆపకుండా చెప్పాడట. ఇక గత నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా మొదట పలు విడుదల తేదీలను మార్చుకుని ఆగష్టు 10న ఫిక్స్ చేసుకుంది. ఇక ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది ఈ చిత్రం.

ఇక ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు డిఫరెంట్స్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. “హృదయ కాలేయం” అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంపూర్ణేష్ బాబు, హృదయ కాలేయం తరువాత ‘సింగం 123’లో నటించినా అది పెద్దగా ఆడలేదు. దాంతో సంపూకి అవకాశాలు తగ్గాయి. మరి “కొబ్బరి మట్ట” హిట్ అయితే సంపూకి మళ్లీ ఛాన్స్ లు వస్తాయోమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు