
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన సినిమా అంటే థియేటర్స్ కి కొదవే ఉండదు. మామూలుగా ఆయన నటించిన సినిమా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది అంటే పెద్ద షాక్ కాకపోవచ్చు కానీ మోషన్ పిక్చర్ టెక్నాలజీతో రూపొంచించిన ‘కొచ్చాడియాన్’ సినిమా రజినీ మానియా వల్ల 3000 పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది అనే విషయం అందరినీ షాక్ కి గురిచేస్తోంది.
మీరు విన్నది నిజమే పలు భాషల్లో మే 9న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా 3000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అందులో కొన్ని ఏరియాల థియేటర్స్ వివరాలు మీ కోసం..
తమిళనాడు – 413 థియేటర్స్ (ఇంకా పెరిగే అవకాశం ఉంది)
ఆంధ్రప్రదేశ్ – 400 థియేటర్స్ (ఇంకా పెరిగే అవకాశం ఉంది)
కేరళ – 250 థియేటర్స్
కర్నాటక – 150 థియేటర్స్
యుఎస్ (తెలుగు+తమిళ్) – 255 స్క్రీన్స్ (172 థియేటర్స్)
ఇవి కాకుండా హిందీ వెర్షన్ థియేటర్స్, అలాగే ఫ్రాన్స్, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన ప్రాంతాల్లో తెలుగు, తమిళ భాషల్లో కలుపుకొని 1500 – 200 థియేటర్స్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ వివరాలను త్వరలోనే మీకందిస్తాం.
సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ‘కొచ్చాడియాన్’ సినిమా పాండ్యన్ కింగ్ అయిన కొచ్చాడియాన్ రణదీరన్ జీవిత కథ. దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, శోభన తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందించాడు.

