‘శ్రీమంతుడు’ స్పెషల్ షోస్ పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

‘శ్రీమంతుడు’ స్పెషల్ షోస్ పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

Published on Jul 22, 2015 7:30 PM IST

mahesh-sri
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. జూలై 30 కల్లా ఫైనల్ కాపీని రెడీ చేసి జూలై 31న ఈ సినిమాని సెన్సార్ కి పంపనున్నారు. ఈ సినిమాలో ప్రస్తుతం సమాజంలో మనం ఫేస్ చేస్తున్న కొన్ని పాయింట్స్ ని టచ్ చేయనున్నారు. అందులో మొదటిది రిచ్ బిజినెస్ మెన్ అయిన మహేష్ బాబు ఒక ఊరిని దత్తత తీసుకోవడం. ఈ కారణం చేత ఈ సినిమాని ప్రధాని నరేంద్ర మోడీ, ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులైన చంద్రబాబు నాయుడు, కెసిఆర్ లకు స్పెషల్ షో వేచి చూపించాలానే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉన్నట్లు ఇది వరకే తెలియజేశాం.

ఈ విషయం పై పూర్తి వివరాలను కనుక్కోవడం కోసం ఈ చిత్ర డైరెక్టర్ కొరటాల శివని అప్రోచ్ అయితే ఆయన ఏం చెప్పాడనేది ఆయన మాటల్లోనే ‘ ప్రధాని, సిఎంలకి షో వెయ్యాలని మేము ఇంకా అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే. ఈ సినిమా మెయిన్ పాయింట్ ఓ ఎన్నారై ఒక గ్రామాన్ని దత్తతు తీసుకొని ఎలా డెవలప్ చేసాడు. ఇదే పాయింట్ ని ప్రధాని మోడీ గారు కూడా ఎంపిలు, బిజినెస్మెన్ లు చెయ్యాలని సూచించారు. అందుకే ఈ పాయింట్ ని అందరికీ రీచ్ అయ్యేలా ఒకసారి పలు రాజకీయ నాయకులకు, బిజినెస్ మెన్స్ కి చూపించాలని అనుకున్నాం. కానీ ఇప్పటి వరకూ ఎవ్వరినీ అప్రోచ్ అవ్వలేదు. అప్రోచ్ అయినా 90% రిలీజ్ అయ్యాకే షోస్ వేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ తెచ్చుకొని మీడియాకి తెలియజేస్తామని’ తెలిపాడు.

మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు