భారత దేశాన్ని ఊపేస్తున్న కొలవెరి

భారత దేశాన్ని ఊపేస్తున్న కొలవెరి

Published on Nov 24, 2011 12:10 AM IST

ఇటీవలి కాలంలో మొట్టమొదటిసారిగా ఒక తమిళ పాట మొత్తం భారత దేశాన్ని ఒక ఊపు ఊపేస్తుంది. ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తున్న ఈ “వై దిస్ కొలవెరి డి’ పాటని మీరు విన్నారా? రజినికాంత్ అల్లుడు ధనుష్ పాడుతూ ఉన్న ఈ వీడియోని సోనీ మ్యూజిక్ విడుదల చేసింది. గత ఐదు రోజుల నుండి ఇంటర్నెట్లో, టీవీల్లో ఎక్కడ చుసిన ఈ పాటే మార్మోగిపోతుంది. ఈ వీడియోలో ఆయనతో పాటు ఆయన భార్య ఐశ్వర్య ధనుష్, శృతి హసన్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా ఉన్నారు.

ఈ వీడియో యూట్యుబ్ లో వారం రోజుల్లోనే 15 లక్షల హిట్స్ సాధించింది. సిఎన్ఎన్-ఐబీఎన్, ఎన్డీటీవీ జాతీయ ఛానళ్ళు కూడా ఈ పాటని ప్రసారం చేసాయి. ఆనంద్ మహీంద్రా వంటి బిజినెస్ మాన్ కూడా ట్విట్టర్లో ఈ పాటని గురించి చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు