ఒక సంఘటన హీరోల తీరు మారేలా చేసింది.

Published on Sep 16, 2019 12:54 pm IST

ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ప్రమాదం తమిళ హీరోల ఓ నిర్ణయానికి కారణమైంది. శుభశ్రీ అనే యువతి ఓ బ్యానర్ కారణంగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ప్రముఖ హీరోలందురూ ప్రత్యక్షంగా, పరోక్షమంగా బ్యానర్స్ సంస్కృతికి వ్యతిరేకంగా తమ గళం విప్పారు. హీరో సూర్య తన తాజా చిత్రం బందోబస్త్ బ్యానర్స్ కట్టరాదని పిలుపునిచ్చారు. అలాగే మరో ఇద్దరు స్టార్ హీరోలైన విజయ్, అజిత్ కూడా దీనికి మద్దతుగా తమ గళం కలిపారు.

వీరితో తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ కూడా కలవడం జరిగింది. ఆయన తమిళనాడులో బ్యానర్స్ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే కమల్ బ్యానర్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన శుభశ్రీ ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. పర్యావరణానికి హానికలిగించడంతో పాటు, అనేక ప్రమాదాలకు కారణమవుతున్న బ్యానర్స్ కి వ్యతిరేకంగా తమిళ హీరోలు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఇది టాలీవుడ్ హీరోలు కూడా అమలుచేస్తే బాగుంటుంది.

సంబంధిత సమాచారం :

X
More