ఉప సభాపతి కోన రఘుపతి బహూకరించిన పురాణపండ ‘ శ్రీపూర్ణిమ” అద్భుతం.

ఉప సభాపతి కోన రఘుపతి బహూకరించిన పురాణపండ ‘ శ్రీపూర్ణిమ” అద్భుతం.

Published on Sep 9, 2019 7:00 AM IST

విజయవాడ;ఇప్పటికే శృంగేరి, కంచికామకోటి, కుర్తాళం పీఠాధిపతుల అనుగ్రహంతోపాటు ,తెలుగు రాష్ట్రాలలో అనేకమంది పండిత ప్రకాండుల అభినందనలు అందుకున్న “మహా మంత్రస్య ‘ , ” శ్రీపూర్ణిమ ” గ్రంధాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకఆలయాలలో పరమ పవిత్రంగా హల్ చల్ చేస్తున్నాయి.తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం లో అతి ప్రాచీన శ్రీరాఘవేంద్రస్వామి ఆలయం, కేశనకుర్రు గ్రామంలోని అద్భుత శ్రీసుబ్రహ్మణ్య ఆలయం, వరాల వేల్పు అన్నవరం సత్యదేవుని ఆలయం, పెద్దాపురంలోబ్రాహ్మణ సేవా సమితి లలో ఈ గ్రంధాలను అర్చక ప్రముఖులకు, ఆలయ ధర్మకర్తలకుఅందిండంతో వారి సంతోషానికి ఆలయ ధ్వజస్తంభాలు సాక్షీభూతంగా నిల్చున్నాయి.

ఈ రెండు మంత్ర గ్రంధాలకూ శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులుపురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనకర్త కావడం గమనార్హం.రాజమహేంద్రవరంలో జరిగిన వైదిక , సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కోన రఘుపతి పవిత్ర హస్తాలమీదుగా నగర ప్రముఖులకు శ్రీపూర్ణిమ అద్భుత గ్రంధాన్ని బహూకరించడం ఒకవిశేషం కాగా, అంతర్జాతీయ స్థాయిలో విశేష ఖ్యాతి పొందిన ప్రఖ్యాత మానసికవైద్య నిపుణులు, సంస్కార సంపన్నులు డాక్టర్ కర్రీ రామ రెడ్డి కి నగరప్రముఖులు ఈ గ్రంథాల్ని బహుకరించడం మరియు ఆంధ్ర ప్రదేశ్ బార్ అసోసియేషన్అధ్యక్షులు , ప్రముఖ న్యాయవాది చల్లా ధనంజయ హైకోర్ట్ లోని కొందరు న్యాయనిపుణులకు, న్యాయ కోవిదులు పంచడం మరో ప్రత్యేక విశేషం.

తూర్పు గోదావరి జిల్లాలో అనేక మంది ప్రముఖులకు ఈ ఉత్తమ గ్రంధం అందడంలోచెన్నాప్రగడ శ్రీనివాస్ ధార్మిక సేవను ప్రత్యేకంగా చెప్పాలి. ఈయన ఇస్కాన్ సంస్థకు కూడా ఎంతో భక్తి పారవశ్యంతో సేవలందిస్తారు.తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఒక విశేష యోగ కార్యక్రమంలో పాల్గొన్నప్రముఖులకు వ్యాపారవేత్త చెన్నా రాజు భక్తియుతంగా ‘మహామంత్రస్య’గ్రంధాలను బహూకరించి అభినందలు పొందారు. మహామంత్రస్య గ్రంధం పట్ల విశేషభక్తిని, గౌరవాన్ని ప్రకటించే చెన్నరాజు వ్యాపార కార్యక్రమాలకువెళ్ళినప్పుడు కూడా ఎంతోమందికి ఈ చక్కని గ్రంధాన్ని బహూకరించడం ఆయనసంస్కారానికి మరో నిదర్శనం.మహామంత్రస్య గ్రంధాన్ని పురాణపండ శ్రీనివాస్ అద్భుతంగా తీర్చి దిద్దారు.శ్రీపూర్ణిమ గ్రంధాన్ని కూడా ఆయనే అపురూపంగా అందించారు. చెరొకగ్రంధాన్ని నాటి ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు,నేటి ముఖ్యమంత్రివై.ఎస్. జగన్మోహన రెడ్డి ఆవిష్కరించడం ప్రత్యేకంగానే చెప్పాలి.పెద్దాపురంలో బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి చర్ల వేంకటసీతారామారావు పర్యవేక్షణలో అనేకమంది వేదపండితోత్తములకు ఈ గ్రంధాలనుసమర్పించారు.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నగరి ఎమ్మెల్యే రోజా,దిల్ రాజు, సాయి కొర్రపాటి , నంబర్ వన్ యాంకర్ సుమ తదితర ప్రముఖుల నిత్య పారాయణ గ్రంథాలుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ అద్భుత గ్రంధాలునిస్సందేహంగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ని చరిత్రకెక్కిస్తాయి.గత నెల ఈ ప్రతుల ఏడవ ప్రచురణని విఖ్యాత ధార్మిక ప్రవచకులు, అద్భుతప్రసంగాల మాహావక్స్త చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించి , తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు, సీనియర్ ఐ.ఏ.ఎస్.అధికారి డాక్టర్ కె.వి.రమణాచారికి తొలి ప్రతుల్ని అందజేశారు.గోదావరి తీరంలోని శ్రీ రాఘవేంద్రస్వామి పవిత్రాలయంలో శ్రీమతి మహేంద్రవాడసుధావాణి పరమ భక్తితో సమర్పించిన శ్రీపూర్ణిమ గ్రంధానికి ఆలయ ప్రధాన అర్చకులు వేదపఠన పూర్వక ఆశీర్వచనం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు