
ప్రముఖ రచయిత, అనేక బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలను అందించిన కోన వెంకట్ మెగా ఫోన్ పట్టాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వాలని ఉందని తన మనసులో కోరికను బయటపెట్టారు కోన వెంకట్. ఇటివల పవన్ ప్లేసులో రవితేజ పేరు వచ్చి చేరింది. పేస్ బుక్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు దీనిపై స్పందించారు కోన.
నేను ఫస్ట్ డైరెక్షన్ చేయవలసిన సినిమా ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ గారిది అనుకుంటున్నాను. ఒకవేళ పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటే రవితేజతో సినిమా చేస్తాను. ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇష్టమైన హీరోలు. నేను దర్శకత్వం వహించబోయే మొదటి సినిమాకు ఇంకా కథ రాసుకోలేదు. కథ ఫైనలైజ్ అయిన తర్వాత హీరో ఎవరనేది చెప్తాను. టైంను బట్టి, స్క్రిప్ట్ బట్టి అది ఎవరికీ సూట్ అవుతుంది అనుకుంటే వారితో సినిమా చేస్తానని కోన వెంకట్ తెలిపారు. రచయితగా బిజీగా ఉండడం వలన మెగా ఫోన్ చేతబట్టడం లేటవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రచయితలు దర్శకులుగా మారుతున్నారు. వివి వినాయక్, గోపీచంద్ మలినేని & ఇతర దర్శకులతో నాకు బాగా సాన్నిహిత్యం ఉంది. వారి సినిమాలకు నేనే కథలు అందించవలసిన భాద్యత నాపై పడిందని చెప్పారు.