
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో భారీ ఎత్తున ‘బ్రూస్‌లీ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దర్శకుడు శ్రీనువైట్ల బ్రాండ్ మార్క్ కామెడీతో పాటు, రామ్ చరణ్ స్టైల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో వస్తోన్న ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని సినిమా యూనిట్ చెబుతోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్, సినిమాపై మరింత అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయని ట్రైలర్ ఋజువు చేసింది.
ఇక ఇదిలా ఉంటే.. అనౌన్స్ అయిన రోజునుంచే విపరీతమైన అంచనాలతో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా టైటిల్ విషయంలో మొదట్లో రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. ‘బ్రూస్‌లీ’, ‘మై నేమ్ ఈజ్ రాజు’.. ఇలా చాలా పేర్లే వినిపించగా, చివరకు ఈ ప్రచారాల్లో ఒకటైన ‘బ్రూస్‌లీ’ పేరునే ఖరారు చేశారు. బ్రూస్‌లీ అనే పేరునే ఖరారు చేయడానికి గల కారణాన్ని ఈ సినిమా రచయిత కోన వెంకట్ ఈ సందర్భంగా తెలిపారు. సాధారణంగా సినిమాలకు పనిచేసే స్టంట్‌మెన్స్ అందరికీ ఒక్కో నిక్‌నేమ్ ఉంటుందని, ‘బ్రూస్‌లీ’ సినిమాలో స్టంట్ మ్యాన్‍గా కనిపిస్తోన్న రామ్ చరణ్‌ను అందరూ బ్రూస్‌లీ అని పిలుచుకుంటూంటారని, ఆ నేపథ్యం నుంచే ఈ సినిమా బ్రూస్‌లీ అనే పేరు ఖరారు చేశామని కోన వెంకట్ తెలిపారు. ఈ సినిమాకు అదే సరైన టైటిల్ అని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.