‘రాక్షసుడు’ని పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్స్ – కోనేరు సత్యనారాయణ

‘రాక్షసుడు’ని పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్స్ – కోనేరు సత్యనారాయణ

Published on Aug 12, 2019 6:00 AM IST

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియో బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రాక్షసుడు’. ఆగస్ట్ 2న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో కార్యక్రమంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కొనేరు సత్యనారాయణ, రమేశ్ వర్మ, అభిషేక్ నామా, మారుతి, అమలాపాల్, మల్టీడైమన్షన్ వాసు, వెంకట్, నిర్మాత భరత్ చౌదరి, శరవణన్, వినోద్ సాగర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా… కొనేరు సత్యనారాయణ మాట్లాడుతూ – ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాక్షసుడు మాటనే వినపడుతుంది. ఆగస్ట్ 2న రాక్షసుడు విడుదలైంది. తమిళంలో ఈ సినిమాను చూసినప్పుడు ఎంత థ్రిల్ ఫీలయ్యానో అదే ఫీలింగ్ ఈ సినిమా విషయంలోనూ కలుగుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమాను థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నారు. మంచి సినిమాను తీస్తే అందరూ సినిమాను బాగా ఆదరిస్తారనడానికి ఈ సినిమా ఓ నిదర్శనంగా నిలుస్తుంది. ఓ పద్ధతి ప్రకారం ఈ సినిమాను ప్లానింగ్‌తో, సిస్టమేటిక్‌గా చేశాను. ప్రమోషన్స్ విషయంలో చక్కగా కేర్ తీసుకున్నాను. అందువల్లనే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తర్వాత మంచి మౌత్ టాక్ కారణంగా మంచి కలెక్షన్స్ వచ్చాయి. రెండో వారం కూడా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. మేం అనుకున్న ఫలితాన్ని సాధించినందుకు ఆనందంగా ఉంది.

అమలాపాల్ మాట్లాడుతూ – రాక్షసుడు సినిమా యూనిట్‌కి అభినందనలు. తమిళంలో సినిమా చాలా పెద్ద హిట్ అయ్యంది. అలాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. రమేశ్ వర్మగారికి అభినందించాలి. శ్రీనివాస్ చాలా సెటిల్డ్‌గా నటించారు. నిర్మాతలకు, ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ – ఇలాంటి ఓ అద్భుతమైన రోజు కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. మా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. రమేశ్ వర్మగారికి, కొనేరు సత్యనారాయణగారికి థ్యాంక్స్. వెంకట్ చాలా కష్టపడి వర్క్ చేశాడు. అందరూ మనసు పెట్టి పనిచేశారు. అందరికీ రుణపడి ఉంటాను. విలన్‌గా నటించిన శరవణన్‌గారు ఎక్సలెంట్‌గా నటించారు. చాలా టఫ్ జాబ్ చేశారు. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. కమర్షియల్ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న సినిమా ఇది. సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు