లేటెస్ట్ బజ్..”ఆచార్య”లో చరణ్ తో కొరటాల మార్క్ సీన్.?

Published on Apr 14, 2021 11:01 am IST

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంలో చిరుతో పాటుగా మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ధ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇపుడు చరణ్ రోల్ కు సంబంధించే ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

కొన్ని రాజుల కితమే కొరటాల చరణ్ తో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారని విన్నాము. మరి అది తన ప్రతీ సినిమాలో పెట్టే మార్క్ యాక్షన్ బ్లాక్ అన్నట్టు తెలుస్తుంది. అలాగే మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఏమిటంటే చరణ్ తో అదిరే రైన్ ఫైట్ ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే కొరటాల తన మొదటి సినిమా “మిర్చి”లో ప్రభాస్ తో రైన్ ఫైట్ చూపించి మూవీ లవర్స్ ఫీస్ట్ అందించారు. మరి ఈసారి ఎలాంటి ప్లాన్ చేస్తున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :