“ఆచార్య” షూట్ కోసం కొరటాల స్పెషల్ ప్లాన్స్..!

Published on Sep 23, 2020 5:18 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఆచార్య”. ఎక్కడా తగ్గకుండా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నేలకూన్నాయి. ఇదిలా ఉండగా లాక్ డౌన్ మూలాన అన్ని చిత్రాలలానే ఈ సినిమాకు కూడా బ్రేక్ పడింది. కానీ సినిమా షూట్ మాత్రం ఇంకా పునః ప్రారంభం కాలేదు.

దీనికి కారణం ఇంకా అనుకూల వాతావరణం నెలకొనగా పోవడం మూలానే చిరు అందాక రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్నారని తెలుస్తుంది. కానీ ఇప్పటికే ఆలస్యం కావస్తుండడంతో చిరు పాల్గొనే విధంగా స్పెయిల్ ప్లానింగ్స్ చేస్తున్నారట. ముందు కొరటాల చిన్నగా ట్రయిల్ షూట్ ను కొంతమంది నటులతో చేసి అప్పుడు అంతా బాగా ఉండి ఎవరికీ ఎలాంటి ప్రభావం తాకనట్టైతే అప్పుడు చిరు షూటింగ్ లో పాల్గొననున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం షూటింగ్ కూడా తొందరలోనే ప్రారంభం కానుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :