చరణ్ రోల్ పై కొరటాల మరింత కేర్.?

Ram Charan 2

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ “ఆచార్య” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. వాటిలో మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి కూడా ఒకటి. దీనితో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఇదిలా ఉంటే చరణ్ రోల్ పై మరిన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో చరణ్ కేవలం గెస్ట్ రోల్ గా చేస్తుండగా కొరటాల ఆ పాత్రకు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తుంది. అంతే కాకుండా ఆ రోల్ నిడివిని కూడా కాస్త పెంచారని ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్. ఇప్పటికే చరణ్ కు ఫిమేల్ లీడ్ ను ఎవరిని చర్చగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి చిత్రంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version