బలమైన కంటెంట్ తో దిగిన మహేష్, కొరటాల

సామాజిక అంశానికి కమర్షియల్ విలువల్ని జోడించి బలమైన సందేశాన్ని ఇవ్వడంలో మంచి పట్టున్న దర్శకుడు కొరటాల శివ. గతంలో మహేష్ బాబుతో కలిసి ‘శ్రీమంతుడు’ సినిమా చేసి గ్రామాల దత్తత ప్రక్రియను వేగవంతం చేసిన కొరటాల శివ మరోసారి సూపర్ స్టార్ తో కలిసి ‘భరత్ అనే నేను’ రూపంలో పొలిటికల్ మెసేజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఇందులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న యువకుడు భరత్ (మహేష్ బాబు) రాష్ట్రానికి తిరిగొచ్చి సమాజ శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడు అనేది ముఖ్యాంశం. టీజర్లో ఈ అంశాన్ని కొరటాల శివ మహేష్ ఛరీష్మాని పుష్కలంగా వాడుకుని తనదైన ఎలివేషన్ తో, అర్థవంతమైన మాటలతో వివరించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ప్రేక్షకులు, అభిమానులు కూడ టీజర్ పట్ల సంతృప్తి చెందటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

మరి ఈ ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాలోని పూర్తి సందేశం ఏమిటో తెలియాలంటే ఏప్రిల్ 20 వరకు ఆగాల్సిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు.

టీజర్ కొరకు క్లిక్ చేయండి

Exit mobile version