కొరటాల – మెగాస్టార్ సినిమా లేటెస్ట్ అప్ డేట్ ?

స్టార్ హీరోలందరూ కొరటాలతో సినిమా చెయ్యటానికి ఇంట్రస్ట్ చూపుతున్నారంటే.. అది అతిశయోక్తి కాదు. చిన్న డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ప్రస్తుతం కొరటాల తన తర్వాత సినిమాను, మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న విషయం తెలిసిందే.

కాగా కొరటాల శివ – మెగాస్టార్ సినిమా గురించి గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారని తెలుస్తోంది.

అయితే ఈ చిత్రంలో చిరు రైతు పాత్రలో నటించనున్నారట. చిరంజీవి పాత్ర ద్వారా నేటి రైతు పరిస్థితులకు మరియు వారి సమస్యలకు సరైన పరిష్కారం చూపిస్తారట. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా తమన్నాని తీసుకోనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. చిరు పక్కన గాని తమన్నా నటిస్తే.. ఆమె కెరీర్ కి అది చాలా ప్లస్ అవుతుంది. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కాబోతోంద‌ని సమాచారం.

Advertising
Advertising