టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “కోట బొమ్మాళి PS”

టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “కోట బొమ్మాళి PS”

Published on May 2, 2024 5:07 PM IST

టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు తేజ మర్ని దర్శకత్వం లో తెరకెక్కిన పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్ కోట బొమ్మాళి PS. ఈ చిత్రం గతేడాది నవంబర్ 24 వ తేదీన థియేటర్ల లోకి వచ్చింది. ఆడియెన్స్ నుండి ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా సొంతం చేసుకుంది. అయితే ఈ ఆదివారం నాడు సాయంత్రం 6:00 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. రంజిన్ రాజ్, మిథున్ ముకుందన్ లు సంగీతం అందించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు