తెలుగులో ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “కోటబొమ్మాళి పి ఎస్” ఒరిజినల్ వెర్షన్

తెలుగులో ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “కోటబొమ్మాళి పి ఎస్” ఒరిజినల్ వెర్షన్

Published on Apr 23, 2024 6:38 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులు రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ అలాగే వెర్సటైల్ నటులు వరలక్ష్మి శరత్ కుమార్, శ్రీకాంత్, మురళీ శర్మలు ముఖ్య పాత్రల్లో నటించిన రీసెంట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమే “కోటబొమ్మాళి పిఎస్”. మరి వినూత్న ప్రమోషన్స్ నడుమ మంచి బజ్ తో వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో మంచి రన్ తో ఇంప్రెస్ చేసింది.

అయితే ఈ సినిమా ఒరిజినల్ గా మళయాళ హిట్ చిత్రం “నాయట్టు” కి రీమేక్ గా చేశారు. అయితే అందులో సోల్ ని ఎక్కడా పోగొట్టకుండా దర్శకుడు తేజ మార్ని మెప్పించాడు. మరి ఒరిజినల్ ని మన తెలుగులో చూడాలి అనుకునేవారు కూడా ఉంటారుగా వారి కోసం ఇప్పుడు ఆహా వారు నాయట్టు సినిమాని తెలుగులో “చుండూరు పోలీస్ స్టేషన్” గా తీసుకురాబోతున్నారు.

మరి మళయాళంలో శ్రీకాంత్ పోషించిన ఎమోషనల్ పాత్రని ని విలక్షణ నటుడు జోజు జార్జ్ చేశారు. మరి ఈ సినిమాని తెలుగులో ఆహా వారు ఈ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా డేట్ లాక్ చేశారు. మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు అప్పుడు ఆహాలో ట్రై తప్పకుండా ట్రై చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు