పవన్, వైష్ణవ్ సినిమాలతో ఫుల్ బిజీగా క్రిష్ !

Krish

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నుండి వచ్చిన టైటిల్ టీజర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ వచ్చే వారం పూర్తి కానుంది. కాగా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి వన్ మంత్ గ్యాప్ తీసుకుంటారని.. ఆ తరువాత నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని యాక్షన్ సీన్స్ తీస్తారని తెలుస్తోంది. ఇక కోహినూర్ వ‌జ్రం చుట్టూ తిరిగే క‌థ అట ఇది. ప‌వ‌న్ ది రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో నటిస్తున్నాడు.

ఇక వచ్చే వారం నుండి వైష్ణవ్ తేజ్ సినిమాను ముగించే పనిలో ఫుల్ బిజీగా ఉంటాడట క్రిష్. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ షూట్ కోసం రెడీ అవుతుంది. కాగా పవన్ ఆల్ రెడీ ఈ సినిమా చూసాడట. పవన్ కి సినిమా చాలా బాగా నచ్చిందట. కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్, వైష్ణవ్ తేజ్ తో సినిమా చేశాడు. ఇక క్రిష్ డైరెక్షన్ లో పవన్ చేస్తోన్న సినిమాను అక్టోబర్ కల్లా పూర్తి చేసి.. వచ్చే సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు.

Exit mobile version