దర్శకేంద్రుడు చెప్పిన ముగ్గరు దర్శకులలో ఒకరు దొరికేశారుగా…!

Published on May 30, 2019 12:55 pm IST

తెలుగు సినిమా దిగ్దర్శకులలో ఒకరైన రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ జయంతి రోజున తాను ముగ్గురు దర్శకులు, ముగ్గరు హీరోయిన్స్, ఒక హీరో కంబినేషన్లో ఓ ప్రయోగాత్మక మూవీ ని నిర్మించనున్నట్లు చేసిన ఓ ప్రకటన ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇంత పెద్ద దర్శకులు నిర్మాతగా మారి తీయనున్న ఆ మూవీ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులలో ఆసక్తి పెరిగిపోయింది.

తాజా సమాచారం ప్రకారం ఆ ముగ్గరు దర్శకులలో ఒకరిని రాఘవేంద్ర రావు నిర్ణయించారంట. ఇటీవల ఎన్టీఆర్ జీవిత కథకు దర్శకత్వం వహించిన క్రిష్ ఆ ముగ్గరిలో ఒకరంట. దానితో పాటు ఈ మూవీ హీరోయిన్స్ ప్రధానంగా సాగే కథ అని, ముగ్గరు హీరోయిన్స్ కథలను ముగ్గరు డైరెక్టర్స్ తెరకెక్కిస్తారని చెవుతున్నారు. రాఘవేంద్ర రావ్ ప్రకటించినట్లు ఈ మూవీలో ఉండే ఆ ఒక్క హీరోగా నాగ శౌర్య చేయనున్నారట. ముగ్గరు హీరోయిన్స్ కథలలో నాగ శౌర్య పాత్ర ఉంటుందట. ఇన్ని ఆసక్తికర విశేషాలున్న ఈ మూవీ ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More