“ఆకాశ వీధుల్లో” ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసిన క్రిష్.!

“ఆకాశ వీధుల్లో” ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసిన క్రిష్.!

Published on Mar 24, 2021 6:29 PM IST

విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం పవన్ తో “హరిహర వీరమల్లు” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా క్రిష్ చేతుల మీదుగా ఆకాశ వీధుల్లో చ్చిత్ర యూనిట్ ఆ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయించారు. మరి ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ – ఫస్ట్ లుక్ చాలా బాగుంది. చిత్రం యొక్క టీజర్ మరియు రెండు పాటలు చూశాను నాకు బాగా నచ్చాయి. టీమ్ అందరికీ అభినందనలు” అని తెలిపారు.

చిత్ర కథానాయిక పూజిత పొన్నాడ మాట్లాడుతూ – క్రిష్ గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.నూతన నటుడు మరియు దర్శకుడిగా పరిచయం అవుతున్న గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ – ” ఈ సినిమా నా రెండున్నర ఏళ్ల కృషి,ఈ మూవీ కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. మా మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసినందుకు క్రిష్ గారికి కృతజ్ఞతలు” అని తెలిపింది.

ఈ చిత్రాన్ని జీ.కే.ఫిల్మ్.ఫ్యాక్టరీ మరియు మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో మనోజ్ జే.డి. మరియు డి.జే. మణికంఠ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నటీనటులు :
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, రచన & దర్శకత్వం : గౌతమ్ కృష్ణ, బ్యానర్లు : జీ కే ఫిల్మ్ ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియషన్స్, ప్రొడ్యూసర్స్ : మనోజ్ జే.డీ & డా. డీ.జె. మణికంఠ, సంగీతం : జుడా శాండీ, డి.ఓ.పీ : విశ్వనాథ్ రెడ్డి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు