దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఘాజీ’ ఫెమ్ సంకల్ప్ రెడ్డి స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘ అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ రోజు ఈ చిత్రబృందం ప్రెస్ మీట్ ని నిర్వహించింది.
ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. ‘అంతరిక్షం సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన తొలి తెలుగు స్పేస్ థ్రిల్లర్ సినిమా ఇది. సంకల్ప్‌రెడ్డి అద్భుతంగా రూపొందించారు. పిల్లలతో పాటు పెద్దలను ఈ సినిమా మెప్పిస్తుంది.
అలాగే సరికొత్త తెలుగు సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నది. దేవాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు చేసే అద్భుతాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. గమ్యం, కంచె తర్వాత మా ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్‌లో మరో గొప్ప చిత్రంగా అంతరిక్షం నిలిచింది. అని అన్నారు
