
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడవతరం వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన హీరో అఖిల్ అక్కినేని. అఖిల్ హీరోగా చేసిన మొదటి సినిమా ‘అఖిల్’ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో నాగార్జున అఖిల్ కెరీర్ పై స్పెషల్ కేర్ తీసుకొనే పనిలో ఉన్నాడు. అందులో భాగంగానే నాగార్జున ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ని కమర్షియల్ యాంగిల్ లో పర్ఫెక్ట్ గా ప్రెజంట్ చేయగల దర్శకుల నుంచి అఖిల్ కి సరిపోయే కథలు ఉంటే తీసుకురమ్మని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు.
ఎప్పటికప్పుడు విభిన్న తరహా కథలను కమర్షియల్ గా చెప్పడానికి ట్రై చేసే దర్శకులలో క్రిష్ ఒకడు. రీసెంట్ గా వచ్చిన కంచె సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా కమర్షియల్ గా కూడా డీసెంట్ రెవిన్యూ సొంతం చేసుకుంది. అందులో భాగంగానే నాగార్జున స్పెషల్ గా క్రిష్ ని పిలిపించి అఖిల్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే స్టొరీ లైన్స్ ఉన్నా చెప్పమని, అలాగే కుదిరితే అఖిల్ కోసం ఒక కథ తయారు చేయమని చెప్పారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. నాగార్జున అఖిల్ సెకండ్ సినిమా కోసం ఓ సూపర్బ్ కథని వెతికే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.