క్రిష్ కు అదనపు పారితోషికం అంటా !

క్రిష్ కు అదనపు పారితోషికం అంటా !

Published on Jan 14, 2019 10:32 PM IST

Krish

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ దర్శకుడు క్రిష్ కు బోనస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ కు అదనపు పారితోషికం ఇవ్వటంతో ఈ సినిమా విజయం పట్ల బాలయ్య ఎంత ఖుషీగా ఉన్నారో అర్థమవుతుంది.

మొదట్లో సినిమా రెండు భాగాలకు కలిపి క్రిష్ కు రెమ్యూనరేషన్ ఇచ్చారట, అయితే సినిమా షూటింగ్ సమయంలో క్రిష్ చూపిన అంకిత భావం, ప్రణాళికాబద్దత, మూడు నెలల సమయంలోనే సినిమా పూర్తి చేయటం బాలయ్య ఇంప్రెస్స్ అయ్యారని సమాచారం. ఈ క్రమంలో మహానాయకుడు విడుదలకు ముందే అదనపు పారితోషికం ఇవ్వనున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

తాజా వార్తలు