ఇండోనేషియాలో జరిగిన అంతర్జాతీయ చిత్రాల అవార్డుల వేడుకలో ‘పరంపర’ చిత్రం ప్లాటినం అవార్డుని సొంతం చేసుకున్న విషయం 123తెలుగు ద్వారా మేము ముందుగానే తెలిపాం. ఈ సినిమా రేపు సెలెక్టెడ్ స్క్రీన్ లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ప్రిమియర్ ను నిన్న ప్రదర్శించారు. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ఈ షో కి హాజరయ్యారు.
ఈ చిత్రాన్ని చూసి ఆ జంట సంతోషించారు. సినిమా మంచి విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈ సినిమాను మరో 5 అంతర్జాతీయ అవార్డులకు నామినేట్ చేసారు. మధు మహంకాళి ఈ సినిమాను తెరకెక్కించి, నిర్మించడమే కాకుండా సంభాషణలు సైతం రచించారు. నరేష్ మరియు ఆమని నటించిన ఈ సినిమాలో సాయి తేజ్, రావికొండల రావ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.


