‘ఛల్ మోహన్ రంగ’ అందర్నీ మెప్పిస్తుందట !

‘ఛల్ మోహన్ రంగ’ అందర్నీ మెప్పిస్తుందట !

Published on Apr 3, 2018 5:53 PM IST

నితిన్, మేఘా ఆకాష్ లు రెండవసారి జోడీకడుతూ చేసిన చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’. త్రివిక్రమ్ కథను అందించడం పవన్ కళ్యాణ్ తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సినిమాను నిర్మించటంతో ప్రేక్షకుల్లో అంచనాలు కూడ మంచి స్థాయిలోనే ఉన్నాయి. ఇటీవకే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా క్లీన్ U సర్టిఫికెట్ పొందింది.

ఈ చిత్రం గురించి దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ అన్ని ప్రేమ కథలు ఒకేలా ఉంటాయి. కానీ వాటిని చెప్పే విధానంలోనే సినిమా యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాలో ప్రేమ కథను కొత్తగా చెప్పడం జరిగింది, ఇందులోని ఫన్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తాజా వార్తలు