ఫిల్మ్ సిటీలో సభ్యుడిగా సూపర్ స్టార్ కృష్ణ – కేసీఆర్.

krishna-kcr

తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ఫిల్మ్ సిటీలో సూపర్ స్టార్ కృష్ణ సభ్యుడిగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఆయన అనుభవాలు ఫిల్మ్ సిటీ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని సియం కెసిఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పారు చేసిన మీడియా సమావేశంలో తాను కృష్ణ అభిమాని అని కెసిఆర్ చెప్పారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు సినిమా 10,15 సార్లు చూసినట్టు తెలిపారు. మొదట తెలంగాణలో రెండు వేల ఎకరాలలో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పిన కేసీఆర్.. తాజాగా నాలుగు వేల ఎకరాలలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

కెసిఆర్ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించగానే కృష్ణ ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. ఒక అడుగు ముందుకేసి ఆ ఫిల్మ్ సిటీకి కేసీఆర్ పేరు పెడితే బాగుంటుందని సూచించారు. కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. కేసీఆర్ కృష్ణను ఫిల్మ్ సిటీలో సభ్యుడిగా నియమించడం పట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పద్మాలయా స్టూడియో నిర్వహణలో కృష్ణకు మంచి అనుభవం ఉన్న సంగతి తెలిసిందే.

Exit mobile version