‘నటసామ్రాట్’ కోసం సన్నద్ధం అవుతున్న ‘కృష్ణ వంశీ’ !

krishna vamsi

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ‘కృష్ణ వంశీ’ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. దాంతో ప్రముఖ నటుడు నానా పటేకర్ ప్రధాన పాత్రగా మరాఠీలో రూపొంది మంచి విజయం సాధించిన ‘నటసామ్రాట్’ చిత్రాన్ని కృష్ణ వంశీ తెలుగులోకి రీమేక్ చెయ్యటానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

కాగా నానా పటేకర్ పాత్రలో ప్రకాష్ రాజ్ ను తీసుకోవాలనే ఉద్దేశ్యంతో కృష్ణ వంశీ ప్రకాష్ రాజ్ కి అప్రోచ్ అయ్యారట. ప్రకాష్ రాజ్ కూడా ‘నటసామ్రాట్’ చిత్రం పట్ల ఆసక్తి చూపించారట. అన్ని అనుకూలిస్తే త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. మరి ఈ రీమేక్ కథతోనైనా కృష్ణ వంశీ మళ్ళీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

Exit mobile version