క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమా అక్టోబర్ 1న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.
ప్రస్తుతం హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కృష్ణవంశీ ఈ సినిమా ఎడిటింగ్ స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఈ సినిమాలోని ప్రతి పాటని ఎడిటింగ్ చేసే టైంలో ఎడిటర్ తో పాటు కూర్చొని సాంగ్స్ సంథింగ్ స్పెషల్ గా ఉండేలా కేర్ తీసుకున్నారు. అలాగే ఈ సినిమా చివరి 30 నిమిషాలలో వచ్చే సీన్స్ పై కూడా ప్రత్యెక శ్రద్ధ తీసుకున్నారు. మామూలుగానే కృష్ణవంశీకి సాంగ్స్ షూట్ చేయడంలో మంచి పేరుంది. దానిప్రకారం ఈ సినిమా సాంగ్స్ కూడా విజువల్ గా సూపర్బ్ గా ఉంటాయని ఈ చిత్ర టీం అంటోంది.
రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈమూవీ లో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ, జయసుధ ప్రముఖ పాత్రలు పోషించారు. బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు.
