విలేజ్ యాక్షన్ డ్రామా గా “కృష్ణమ్మ” ట్రైలర్!

విలేజ్ యాక్షన్ డ్రామా గా “కృష్ణమ్మ” ట్రైలర్!

Published on May 1, 2024 9:06 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వివి గోపాల కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా కృష్ణమ్మ. మే 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను నేడు విడుదల చేశారు.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యాక్షన్ ఎలిమెంట్స్ తో మంచి ఎమోషన్స్ తో కూడిన డ్రామా ను ట్రైలర్ లో చూడవచ్చు. సత్యదేవ్ నటన ట్రైలర్ లో అద్బుతం గా ఉంది. అర్చన, కృష్ణ బురుగుల, అతిర రాజ్, లక్ష్మన్ మీసాల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ను అరుణాచల క్రియేషన్స్ పతాకంపై నిర్మించగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు