నేచ్యురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్ బాగుండటం, పాటలు ఆకట్టుకోవడం పైగా నాని ద్విపాత్రాభినయం చేయడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. సాధారణంగానే ఓవర్సీస్లో నాని సినిమాలకు డిమాండ్ కొంచెం ఎక్కువే. అలాంటిది వరుస హిట్ల తర్వాత ఆయన్నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు అక్కడి ప్రేక్షకులు.
అందుకే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సినిమాను సుమారు 600 స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నారు. నాని కెరీర్లో ఇదే ఉత్తమమైన విడుదలని చెప్పొచ్చు. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తుండగా ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హిపాప్ తమిజా స్వరాలు సమకూర్చారు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ఫేమ్ మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.


