బ‌జ్.. ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి..?

బ‌జ్.. ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి..?

Published on Jul 6, 2024 4:00 PM IST

టాలీవుడ్ లో ‘ఉప్పెన’ మూవీతో ఒక్కసారిగా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బ్యూటీ కృతి శెట్టి, యూత్ హాట్ ఫేవ‌రేట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమాలో అమ్మ‌డి అందం, అభిన‌యానికి కుర్ర‌కారు ఫిదా అయ్యారు. ఇక ఆ త‌రువాత వ‌రుస‌గా స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌తో టాలీవుడ్ లో దూసుకెళ్లింది ఈ బ్యూటీ. కానీ ఇటీవ‌ల వ‌రుస ఫ్లాప్ చిత్రాల‌తో ప్రేక్ష‌కులకు నిరాశ‌ను మిగిలిస్తోంది ఈ బ్యూటీ.

అయితే, రీసెంట్ గా ‘మ‌న‌మే’ సినిమాతో తిరిగి స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని గ‌ట్టిగానే ప్లాన్ చేసింది ఈ బ్యూటీ. కానీ, ఆమె ప్ర‌యత్నం అంతంత మాత్రంగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఓ ల‌క్కీ ఛాన్స్ కృతి శెట్టిని వ‌రించిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో వ‌రుసగా సినిమాలు ఓకే చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే ‘ల‌క్కీ భాస్క‌ర్’ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేశాడు ఈ హీరో. ఇక త‌న నెక్ట్స్ చిత్రాన్ని కూడీ ఓకే చేశాడ‌ట దుల్క‌ర్.

ద‌ర్శ‌కుడు సెల్వ‌రాజ్ డైరెక్ష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌నుండ‌గా, ఇందులో దుల్క‌ర్ హీరోగా న‌టిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతి శెట్టికి హీరోయిన్ గా ఛాన్స్ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను రానా ద‌గ్గుబాటి ప్రొడ్యూస్ చేయ‌నున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌టన త్వ‌ర‌లో రానుంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఈ సినిమాతో తిరిగి త‌న అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కృతి శెట్టి ప్ర‌య‌త్నిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు