వాయిదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ‘ఉప్పెన’ బ్యూటీ

Krithi Shetty

‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన కృతి శెట్టి ఆ తర్వాత చేసిన సినిమాలతో మంచి ఫేమ్ సాధించింది. కానీ వరుస ఫ్లాప్స్ ఆమె గ్రాఫ్‌ను కిందికి లాగాయి. తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ సినిమాలకు షిఫ్ట్ అయింది ఈ బ్యూటీ. కానీ, అక్కడ కూడా సాలిడ్ బ్లాక్‌బస్టర్ దక్కడం లేదు. కార్తీతో నటించిన ‘అన్నగారు వస్తారు’పై బోలెడు ఆశలు పెట్టుకుంది ఈ బ్యూటీ.

అయితే, ఆ సినిమా డిసెంబర్ 12 రిలీజ్ కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అటు డిసెంబర్ 18న విడుదల కావాల్సిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కూడా బడ్జెట్ వివాదాల కారణంగా వాయిదా పడుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీంతో వారం గ్యాప్‌లో రిలీజ్ కావాల్సిన కృతి శెట్టి రెండు సినిమాలు ఒకేసారి ఆగిపోయాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె చేయగలిగేదేమీ లేకపోయినా, వాయిదాల ప్రభావం ఆమె కెరీర్‌పై పడుతోంది.

మరి ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూసిన ఈ బ్యూటీ, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వాయిదాలతో అయోమయంలో పడింది.

Exit mobile version