మహేష్ బాబు హీరోయిన్ ఆ అమ్మాయే

Published on Oct 5, 2012 9:55 am IST


14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పై ఫోటోలో కనిపిస్తున్న కృతి సనన్ కథానాయికగా నటించే అవకాశం ఉందని మేము ఇది వరకు తెలిపాము. తాజాగా ఈ సినిమాలో ఆ అమ్మాయే కథానాయికగా ఎంపికైందనే సమాచారం మాకు అందింది. తన డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమా వదులుకున్న కాజల్ అగర్వాల్ స్థానంలో ఈ కృతి సనన్ ని తీసుకున్నారు. కాజల్ అగర్వాల్ తన కాల్షీట్లు ఖాళీ లేవని ఎలాంటి ఇబ్బంది గొడవ లేకుండా ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. త్వరలోనే గోవాలో ప్రారంభం కాబోయే ఈ సినిమా చిత్రీకరణలో మహేష్ తో కృతి సనన్ కలిసి పనిచేయనుంది. ఈ చిత్రంతో మరో మోడల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కథానాయికగా పరిచయం కానుంది.

సంబంధిత సమాచారం :