ఇటీవలే పలువురు బాలీవుడ్ ప్రముఖులకు కూడా కరోనా పాజిటివ్ రావడం అక్కడి సినీ వర్గాలను మరింత భయానికి గురి చేసింది. అయితే లేటెస్ట్ గా కొన్ని రోజుల కితమే మనకి కూడా బాగా తెలిసిన స్టార్ హీరోయిన్ కృతి సనన్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం నటిస్తున్న ఓ సినిమా షూట్ లో పాల్గొనడం వల్ల కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది.
దీనితో ఆమె ఐసోలేషన్ కు కూడా వెళ్ళింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె తన ఫాలోవర్స్ కు తన ఆరోగ్య పరిస్థితి కోసం తెలిపారు. “నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని ముందే తెలిపాను. ఇప్పుడు అసలు అందులో చింత పడడానికి ఏమీ లేదని తాను మొత్తం బాగానే ఉన్నానని క్వారంటైన్ లో డాక్టర్ సలహాలు పాటిస్తున్నాని క్లారిటీ ఇచ్చింది.
అంతే కాకుండా తొందరలోనే నా సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేస్తానని కూడా క్లారిటీ ఇచ్చింది కృతి. ఇక అలాగే అందరి ఆశీస్సులతో తాను బాగానే ఉన్నానని ప్రతీ ఒక్కరు కూడా సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నానని కృతి తెలిపింది. మన తెలుగులో మహేష్ మరియు నాగ చైతన్యలతో నటించిన ఈమె ఇపుడు ప్రభాస్ తో ఆదిపురుష్ లో నటించే అవకాశం ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
???????????? pic.twitter.com/pbMC64X4dV
— Kriti Sanon (@kritisanon) December 9, 2020
