షేర్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజ లను హీరో హీరొయిన్ లుగా పరిచయం చెస్తూ.. చంద్రశేఖరా మూవీస్ పతాకం పై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “కెఎస్100”. కాగా ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయింది.
ఈ సందర్భంగా దర్శకుడు షేర్ మాట్లాడుతూ.. “కెఎస్100” టైటిల్ తగ్గట్టు గానే వైవిధ్యమైన కంటెంట్ తో తెరకెక్కుతొన్న చిత్రం. హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ జొనర్స్ లొ తీశాము. యూత్ ను, లేడీస్ ను ఆకట్టుకునే అంశాలుంటాయి. ఇక ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
టైటిల్ లొగో విడుదల చెస్తున్నాము. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.
అక్షిత, అషి,, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, పూరివి , సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వంశీ, ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున, సాహిత్యం: భాష్య శ్రీ, మ్యూజిక్: నవనీత్ చారి నిర్మాత : వెంకట్ రెడ్డి, మాటలు- కథనం-దర్శకత్వం: షేర్.


