షేర్ దర్శకత్వంలో సమీర్ ఖాన్, శైలజ, సునీత పాండే, ఆశి రాయ్, శ్రద్ధ, అక్షత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కె ఎస్ 100’. చంద్ర శేఖర్ మూవీస్ పతాకం పై కె. వెంకట్ రామ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా నిర్మాత సాయి వెంకట్, మల్టీ డీమెన్షన్ వాసు, అట్లూరి రామకృష్ణ ల చేతుల మీదుగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ విడుదలైయింది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట రామ్ రెడ్డి మాట్లాడుతూ మంచి హర్రర్ థ్రిల్లర్ రొమాంటిక్ మూవీ. సినిమా చాలా బాగొచ్చింది. అందరికీ నచ్చి తీరుతుందని ఆశిస్తున్నా అన్నారు.
హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. యాక్టర్ అవ్వాలనే నా డ్రీమ్ నెరవేరింది. మంచి సబ్జెక్టు తో ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. షేర్ గారు మాకెంతో సపోర్ట్ ను అందించారు. ప్రూవ్ చేసుకునే పాత్ర నాకు అందించినందుకు ఆయన నా స్పెషల్ థాంక్స్. టీమ్ అంతా హార్డ్ వర్క్ చేసాము.. మరిన్ని మంచి సినిమాలతో ఇండస్ట్రీలో కొనసాగాలనుకుంటున్నా. తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు అని తెలిపారు.
దర్శకుడు షేర్ మాట్లాడుతూ.. నా పేరు షిరాజ్.. కానీ ఎవరికీ పలకడం రావడం లేదనే షేర్ అని మార్చుకున్నా.. ఇక సినిమా విషయానికి వస్తే 3ఇయర్స్ నుంచి అనుకుంటున్నా ఈ కథను. మొదట ఒక లైన్ చెప్పగానే నిర్మాత వెంకట్ రెడ్డి గారికి బాగా నచ్చి సినిమా చేద్దామని చెప్పారు. ఈ సబ్జెక్టు యాప్ట్ అవ్వాలనే నలుగురు అందమైన అమ్మాయిలను వెతికి వెతికి మరీ ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అంతేకాదు ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేయాలనే ప్లాన్ లో కూడా ఉన్నాము. కె ఎస్ అంటే హీరోల పాత్ర పేరు కుమార్ స్వామి, ఇక 100 అంటే వాళ్ళ వందరోజుల స్నేహమే… కథ చాలా బాగా వచ్చింది. చాలా డిఫ్ఫరెంట్ స్టోరీ. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ అని చెప్పొచ్చుఅని అన్నారు.


