అతని ఆశలన్నీ ‘వెంకీ మామ’ మీదే

అతని ఆశలన్నీ ‘వెంకీ మామ’ మీదే

Published on Dec 4, 2019 7:11 PM IST

పెద్ద హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చినా దర్శకుడు కె.ఎస్.రవీంద్ర కెరీర్ పెద్ద మలుపులు తిరిగిన దాఖలాలు లేవు. మొదటి చిత్రంగా రవితేజతో ‘పవర్’ సినిమా చేసిన ఆయన ఆ చిత్రం విజయం సాధించినా కొంత కాలం ఎదురుచూసి పవన్ కళ్యాణ్ యొక్క ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. కానీ అనూహ్యంగా ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో ఇరుకునపడిన ఆయన యేడాది తర్వాత ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో ‘జైలవకశ’ తెరకెక్కించాడు.

ఆ చిత్రం బాగానే ఉందని టాక్ తెచ్చుకున్నా సాలిడ్ విజయాన్ని అందివ్వలేకపోయింది. దీంతో బాబీకి మళ్లీ ఎదురుచూపులు తప్పలేదు. సంవత్సరం తర్వాత వెంకటేష్, నాగ చైతన్యలతో ‘వెంకీ మామ’ అనే మల్టీస్టారర్ చిత్రాన్ని మొదలుపెట్టారు. చివరి దశ పనుల్లో ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 13న విడుదలకానుంది. ఈ చిత్రంపైనే బాబీ ఆశలు పెట్టుకున్నారు. ఈ కుటుంబ కథా చిత్రమైనా తనకు హిట్ ఇస్తుందని ఆశిస్తున్నారు. మరి ఆయన ఆశలను ‘వెంకీ మామ’ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు