‘మల్లేశం’కు కేటీఆర్‌ ట్వీట్‌ !

Published on May 30, 2019 7:57 pm IST

చేనేత కార్మికుడు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా రాజ్ ఆర్ దర్శకత్వంలో యంగ్ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం “మల్లేశం”. నేత కార్మికురాలిగా తన తల్లి పడుతున్న కష్టాన్ని చిన్నప్పటి నుండి చూసిన మల్లేశం, తన తల్లిలాగా ఇంకెవ్వరూ కష్టపడకూడదని ఆసుయంత్రాన్ని కనుగొని, నేత కార్మికుల కష్టాన్ని తీర్చాడు. దాంతో కేంద్ర ప్రభుత్వం మల్లేశం చేసిన కృషికి పద్మశ్రీతో సత్కరించింది. కాగా ఈ సినిమాలో ప్రియదర్శికి జోడిగా అనన్య నటిస్తుండగా, శ్రీ అధికార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 21న విడుదల కాబోతుంది.

కాగా తాజాగా ఈ సినిమా థ్రియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూసిన కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘ట్రైలర్ బాగుంది. తెలంగాణకు చెందిన ‘మల్లేశం’ జర్నీ చాలా ప్రేరణ కలిగిస్తోంది. ఆసుయంత్రాన్ని కనుగొన్నందుకు కేంద్ర ప్రభుత్వం మల్లేశంను 2017లో పద్మశ్రీతో సత్కరించింది. ‘మల్లేశం’ జీవిత ఆధారంగా చిత్రాన్ని నిర్మిస్తోన్న ఈ చిత్ర బృందానికి బెస్ట్‌ విషెస్’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత సమాచారం :

More