మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో తెలుగులో టాప్ డైరెక్టర్లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న సుకుమార్, నిర్మాతగా వినూత్న సినిమాలను తెరకెక్కించే పనిని కూడా చేపట్టిన విషయం తెలిసిందే! ఆ కోవలోనే సుకుమార్ తన సొంత బ్యానర్‌పై ‘కుమారి 21F’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆయనే స్వయంగా స్క్రీన్‌ప్లే అందించడం కూడా విశేషం. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో వరుస హిట్స్‌తో దూసుకుపోతోన్న రాజ్ తరుణ్ హీరోగా నటించారు. హీబా పటేల్ హీరోయిన్గా నటించారు.
ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక ఈ ఉదయం సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హైద్రాబాద్‌లో విడుదల చేశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ విడుదల తేదీని ప్రకటించింది. అక్టోబర్ 30న ఈ సినిమాను విడుదల చేయనున్నామని తెలియజేశారు. సుకుమార్ స్టైల్ నెరేషన్‌తో ఓ సరికొత్త ప్రేమకథగా ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది.


