నేడే ‘కుమారి ..’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్!

నేడే ‘కుమారి ..’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్!

Published on Nov 17, 2015 8:16 AM IST

kumri
‘కుమారి 21 ఎఫ్’.. యూత్‌లో గత కొద్దిరోజులుగా క్రేజీగా మారిపోయిన సినిమా. విలక్షణ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ అన్న బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమా మొదట్లో ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోల ప్రమోషన్‌తో విపరీతమైన ఆసక్తి రేకెత్తించగా, ఈమధ్యే విడుదలైన ఆడియో, ట్రైలర్‌‌లతో ఎక్కడికో వెళ్ళిపోయింది. దీనికితోడు ‘కుమారి 21 ఎఫ్’ టీమ్ చేస్తోన్న ప్రచార కార్యక్రమాలు కూడా సినిమాపై మరింత అంచనాలను రేకెత్తిస్తున్నాయి. వరుస హిట్స్‌తో జోరుమీదున్న రాజ్ తరుణ్ హీరోగా నటించడం, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు లంటి టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేయడం వంటి అంశాలు సైతం ఈస్థాయి క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి.

ఇక ఈ క్రేజ్‌తోనే నవంబర్ 20న పెద్ద ఎత్తున కుమారి 21 ఎఫ్ విడుదలకు సిద్ధమైంది. సినిమా రిలీజ్‌కు ఇంకా కేవలం మూడు రోజులే ఉండడంతో ‘కుమారి 21 ఎఫ్’ టీమ్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే నేడు హైద్రాబాద్ కూకట్‌పల్లిలోని శ్రీ చైతన్య కాలేజీలో కుమారి 21 ఎఫ్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే యూత్‌లో పాపులర్ అయిపోగా ఈ సాయంత్రం దేవిశ్రీ స్వయంగా ఈ ఈవెంట్‌లో లైవ్ షో ఇవ్వనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ లైవ్‌షో కావడంతో ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌లో దేవీయే హైలైట్ కానున్నారు. ఇక నిజానికి ఈ ఈవెంట్‌ను నవంబర్ 14వ తేదీనే నిర్వహించాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల అది నేటికి వాయిదా పడింది. రాజ్ తరుణ్ సరసన హెబా పటేల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు