కుర్చీ మడతపెట్టి ఇంపాక్ట్ థమన్ లో కూడా..!

కుర్చీ మడతపెట్టి ఇంపాక్ట్ థమన్ లో కూడా..!

Published on Mar 3, 2024 9:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన లేటెస్ట్ సాలీడ్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం”. మరి ఈ సినిమాలో మాస్ ఫీస్ట్ ఇచ్చిన ఎన్నో అంశాల్లో సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన మాస్ సాంగ్ కుర్చీ మడత పెట్టి సాంగ్ క్రేజ్ వేరు. మ్యూజిక్ ఛార్ట్స్ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్న ఈ మాస్ సాంగ్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకెళ్తుంది.

అయితే ఈ సాంగ్ ఇంపాక్ట్ తనపై కూడా ఉందని థమన్ చెప్తున్నాడు. ప్రస్తుతం సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతుండగా మన టాలీవుడ్ తరపున థమన్ కూడా ఆడుతున్నాడు. థమన్ మామూలుగానే ఓ రేంజ్ లో ఆడుతాడు. ఇప్పుడు మ్యాచ్ లలో అయితే తన బాటింగ్ కి బాట్ లు కూడా విరిగిపోతున్నాయి. దీనితో ఇలా ఆడటానికి మీ మైండ్ లో ఏదన్నా మ్యూజిక్ అనుకుంటారా అని అడగ్గా థమన్ తన సాంగ్ కుర్చీ మడత పెట్టి సాంగ్ తన మైండ్ లో ప్లే చేస్తానని చెప్పుకొచ్చాడు. ఆ మాస్ సాంగ్ తో అయితే థమన్ ఈ రేంజ్ లో ఆడుతున్నాడని చెప్పాలి. మొత్తానికి తన సాంగ్ ఇంపాక్ట్ తనపై కూడా గట్టిగానే ఉంది..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు