టీజర్ టాక్ : గ్రాండ్ విజువల్ ఫీస్ట్‌గా ఇంప్రెస్ చేస్తున్న ‘కూర్మావతార్’

కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాజ్‌తరుణ్, శివాజీ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హై-బడ్జెట్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘కూర్మావతార్’. హర్షవర్ధన్ కడియాల దర్శకత్వంలో పూజిత కె, నరేంద్ర కొండ, సెవితా రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం హై టెక్నికల్ వాల్యూస్‌తో ఆకట్టుకుంటుంది.

మానవుడిలోనే విష్ణువు ఉంటాడని, రాక్షస శక్తుల నుండి ప్రపంచాన్ని కాపాడేందుకు ‘కూర్మావతార్’ ఎలా పునర్జన్మనెత్తాడనేది సాయికుమార్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో.. అద్భుతమైన విజువల్స్‌తో చూపించిన తీరు ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో యోగిగా, మానవ రూపంలో ఉన్న కూర్మావతారంగా కన్నడ సుప్రీం స్టార్ శివ రాజ్‌కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.

అజనీష్ లోక్‌నాథ్ అందించిన డివైన్ బీజీఎం, టాప్ నాచ్ వీఎఫ్ఎక్స్ అండ్ గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ టీజర్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. వరలక్ష్మి శరత్‌కుమార్, రాజ్ తరుణ్, శివాజీల పాత్రలను డిఫరెంట్ షేడ్స్‌తో డిజైన్ చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. డివోషనల్ ఎలిమెంట్స్ మరియు మైండ్-బ్లోయింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ కాన్సెప్ట్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్-బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version