టాక్సిక్ వర్సెస్ జన నాయగన్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?

టాక్సిక్ వర్సెస్ జన నాయగన్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?

Published on Mar 5, 2026 2:00 AM IST

కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన మార్చి 19 నుండి ఈ చిత్రాన్ని జూన్ 4వ తేదీకి పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెవిఎన్ ప్రొడక్షన్స్ వెల్లడించింది. కాగా, ఇదే బ్యానర్ నిర్మిస్తున్న దళపతి విజయ్ చిత్రం ‘జననాయకన్’ కూడా పలు అడ్డంకులను ఎదుర్కొంటోంది.

సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ నిరాకరించడం, ఆపై హైకోర్టు వరకు వెళ్లిన వివాదాలతో ‘జననాయగన్’ విడుదల ఆలస్యమైంది. దీనికి తోడు తమిళనాడు ఎన్నికల కారణంగా ఈ సినిమా మే లేదా జూన్ నెలలో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే, యశ్ ‘టాక్సిక్’ మరియు విజయ్ ‘జననాయగన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అతి తక్కువ గ్యాప్‌లో తలపడే అవకాశం ఉంది. వరుస వాయిదాలతో విజయ్ అభిమానులు అసహనానికి గురవుతుండగా, ఈ రెండు పెద్ద చిత్రాల విడుదల తేదీలను మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తారో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు