విడుదలైన ‘లేడీస్ & జంటిల్ మెన్’ ఆడియో

ladies-and-jentile-man
సోషల్ మీడియా, సైబర్ నేరాలు ప్రస్తుత యువనికపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయి అనే కధాంశంతో తెరకెక్కిన సినిమా ‘లేడీస్ & జంటిల్ మెన్’. తన శిష్యుడు పిబి మంజునాథ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మధుర శ్రీధర్ ఈ సినిమాను నిర్మించారు. రఘు కుంచె స్వరపరిచిన ఈ సినిమాలో పాటల విడుదల కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది. లగడపాటి శ్రీధర్, సందీప్ కిషన్, మంచు మనోజ్, పాప్ సింగర్ స్మిత తదితరులు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులతో కూడా పాల్గొన్నారు.

బిగ్ సిడిని లగడపాటి శ్రీధర్, సందీప్ కిషన్ సంయుక్తంగా విడుదల చేశారు. ఆడియో సిడిని లగడపాటి శ్రీధర్ ఆవిష్కరించి తొలి సిడిని నైజాం డిస్ట్రిబ్యూటర్ అంజిరెడ్డికి అందించారు. ‘మధుర’ ఆడియో ద్వారా పాటలు మార్కెట్ లోకి విడుదలయ్యాయి.

మహాత్ రాఘవేంద్ర, చైతన్య కృష్ణ, అడవి శేష్, కమల్ కామరాజ్, స్వాతి దీక్షిత్, జాస్మిన్, తేజస్విని ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. సిరాశ్రి సాహిత్యం అందించారు. రాజ్ కందుకూరి సమర్పణలో షిరిడి సాయి కంబైన్స్ పతాకంపై యంవికె రెడ్డి, మధుర శ్రీధర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version