​ఫిబ్రవరి 6న ‘లగ్గం టైం’ విడుదల.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సందడి

​ఫిబ్రవరి 6న ‘లగ్గం టైం’ విడుదల.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సందడి

Published on Feb 1, 2026 6:00 AM IST

1

​రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా నటించిన చిత్రం ‘లగ్గం టైం’. 20 సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కె. హిమబిందు నిర్మించిన ఈ చిత్రానికి ప్రజోత్ కె. వెన్నం దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.

​ఈ సందర్భంగా నిర్మాత కె. హిమబిందు మాట్లాడుతూ.. చిన్న సినిమాల మనుగడపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం థియేటర్లలో రీ-రిలీజ్ అవుతున్న చిత్రాల వల్ల చిన్న సినిమాలకు ఆదరణ తగ్గడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వీకెండ్‌లలో రీ-రిలీజ్ చిత్రాలను విడుదల చేయడం వల్ల కొత్త చిత్రాలకు థియేటర్ల కేటాయింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయంలో పరిశ్రమ పెద్దలు ఆలోచించాలని కోరారు. ‘లగ్గం టైం’ ప్రేక్షకులను కచ్చితంగా నవ్విస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

​హీరో రాజేష్ మేరు మాట్లాడుతూ.. హింస, రక్తపాతం లేని ఆహ్లాదకరమైన కథ కావడంతో ఈ సినిమా చేశానని తెలిపారు. కొత్త వారితో రూపొందించినప్పటికీ, మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని దర్శకుడు ప్రజోత్ పేర్కొన్నారు. ఎడిటర్ విశ్వనాథ్, సంగీత దర్శకుడు పవన్, సినిమాటోగ్రాఫర్ పవన్ గుంటుకు ఈ చిత్ర అవుట్‌పుట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉన్న ఈ సినిమాను ఫిబ్రవరి 6న థియేటర్లలో చూడాలని చిత్ర యూనిట్ కోరింది.

తాజా వార్తలు