గుండెల్లో గోదారి తమిళ రిలీజ్ పై ఆశలు పెట్టుకున్న లక్ష్మీ

గుండెల్లో గోదారి తమిళ రిలీజ్ పై ఆశలు పెట్టుకున్న లక్ష్మీ

Published on Mar 21, 2013 7:35 PM IST

manchu_lakshmi

నటిగా, నిర్మాతగా తన టాలెంట్ నిరూపించుకున్న లక్ష్మీ మంచు ఆంధ్రప్రదేశ్లో ‘గుండెల్లో గోదారి’ సినిమాకి లబించిన ఆదరణ విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. సరైన ధరలకు అమ్ముడు పోవడం అలాగే ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ అంతా హ్యాపీ గా ఉన్నారు. తెలుగులో ఈ సినిమాతో కొంత లాభాన్ని అందుకున్న లక్ష్మీ మంచు ప్రస్తుతం ఈ సినిమా తమిళ వెర్షన్ ని రిలీజ్ చేసి లాభాన్ని అందుకోవాలనుకుంటోంది.

‘మరంతేన్ మన్నితేన్’ పేరుతో తమిళంలో రిలీజ్ అవుతోంది. లక్ష్మీ మంచు ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ భారీ ఎత్తున చేస్తోంది. తమిళనాడు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న ఆది, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించారు. తమిళనాడు ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేని మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ నెల 23న ఈ సినిమా తమిలలో విడుదలవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు