‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో కీలక పాత్రలో నటించిన నటుడు ‘విజయ్‌కుమార్’ అనే స్టేజ్ ఆర్టిస్ట్ కి బాలయ్య బాబు ఆర్ధిక సాయం చేశారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈయన భార్యకు ఇటీవల క్యాన్సర్ సోకిందని… విజయ్ కుమార్ వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్నాడని దీంతో బాలయ్య తన బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ లో ‘విజయ్‌కుమార్’ భార్యకు ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారని ఆ వార్తల సారాంశం.
అయితే ఈ వార్త పై విజయ్ కుమార్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. అసలు తనకు బాలకృష్ణగారు సాయం చేసే అవసరం తనకు రాలేదని.. అయినా నేను ఒకరు నుండి ఏది ఆశించనని చెప్పాడు. ఇక ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో ఎంతోమంది నిరుపేదలకు బాలయ్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకుంది. షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా మొదలు పెట్టాలని చూస్తున్నారు.


