‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపించేది అదే !

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపించేది అదే !

Published on Nov 7, 2018 5:30 PM IST

ఎట్టకేలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తెరకెక్కించడానికి రామ్ గోపాల్ వర్మ ముమ్మరంగానే సన్నాహాలు చేస్తున్నాడు. దీంతో తెలుగు తమ్ముళ్లకు ఈ చిత్రం పై భయం పట్టుకుంది. ఎక్కడ తమ మనోభావాలకు వ్యతిరేకంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను వర్మ తెరకెక్కిస్తాడేమోనని టీడీపీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా ఒకింత అనుమానం ఉన్నమాట వాస్తవం. అయితే ఈ చిత్ర కథాంశం వేరేలా ఉంటుందని తెలుస్తోంది.

ముఖ్యంగా ఎన్టీఆర్ కలిగిన వెన్నుపోటు ఘట్టం కంటే కూడా.. తెలుగు వెండితెర పై ఆరాధ్య దైవంగా కోట్లాది ప్రజలు చేత గౌరవింప బడ్డ ఎన్టీఆర్.. ఒక సామాన్య స్త్రీని.. అందులో అరవై సంవత్సరాల వయసులో ఆయనకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ?.

నడిచే దేవుడిగా పిలవబడ్డ ఎన్టీఆర్ ఎందుకు ఆ వయసులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ? లక్ష్మి పార్వతిలో ఆయన్ని అంతగా ఆకట్టుకున్న అంశం ఏమిటి ? లాంటి అంశాలను వర్మ విశ్లేషాత్మకంగా ఈ చిత్రంలో చూపించనున్నాడని తెలుస్తోంది.

ఏమైనా ఎన్టీఆర్ బయోపిక్ లో ‘మహానాయకుడు’కి పోటీగా రాబోతున్న ఈ చిత్రం ఎంత వరకు ఆకట్టుకుంటుందో.. వర్మ ఈ చిత్రానికి ఎంతవరకు న్యాయం చేయగలడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు