గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘లౌక్యం’. దసరా కానుకగా విడుదలైన ఈ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ ను హిట్ సినిమాగా ప్రేక్షకులు డిక్లేర్ చేశారు. రేపటితో ఈ సినిమా 24 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విడుదలైన రెండో వారంలో చాలా సినిమాలు కనుమరుగు అయిపోతున్న సమయంలో ఒక సినిమా 24 కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడడం గొప్ప విషయమే.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు కోన వెంకట్ – గోపి మోహన్ ద్వయం అందించిన స్క్రీన్ ప్లే, శ్రీధర్ సీపాన రాసిన కామెడీ పంచ్ డైలాగులు బాగా పేలడంతో సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. వినోదానికి లోటు లేకపోవడం సినిమా మెయిన్ ప్లస్ పాయింట్. ఈ సినిమాతో నిర్మాతకు కాసుల పంట పండింది.


