భారి మల్టీస్టారర్ మూవీగా ‘సూపర్ స్టార్ కిడ్నాప్’

భారి మల్టీస్టారర్ మూవీగా ‘సూపర్ స్టార్ కిడ్నాప్’

Published on Jul 15, 2014 2:08 PM IST

super-star
నందు, ఆదర్శ్, భూపాల్, పూనం కౌర్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘సూపర్ స్టార్ కిడ్నాప్’. సుశాంత్ రెడ్డి దర్శకుడు. సాయి కార్తీక్ అందించిన ఆడియో వినూత్నంగా చిత్రపరిశ్రమ ప్రముఖుల సమక్షంలో విడుదలైంది. క్రైమ్ కామెడీ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల దగ్గర నుండి ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేసింది.

ఈ చిత్రానికి మరొక ప్రత్యెకత ఉంది. అల్లరి నరేష్, నాని, ప్రిన్సు ఇలా ఏడుగురు యువ హీరోలు ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ చిత్రంలో అతిధి పాత్రలలో కనిపించనున్నారు. ఇంతమంది యువ హీరోలు ఒకే సినిమాలో గెస్ట్ రోల్స్ చేయడం ఇటివల కాలంలో ఇదే మొదటిసారి. మహేష్ బాబు మాస్క్ వేసుకుని సినిమాకి భారి లెవెల్లో ఫ్రీ పబ్లిసిటీ పొందారు. యువ హీరోల గెస్ట్ రోల్స్ అనే అంశం పబ్లిసిటీకి ఎలా ఉపయోగించుకుంటారో..?

తాజా వార్తలు