ఫస్ట్ లుక్ తో వచ్చిన ‘లారి చాప్టర్ -1’

ఫస్ట్ లుక్ తో వచ్చిన ‘లారి చాప్టర్ -1’

Published on May 16, 2024 9:32 AM IST

కింగ్ మేకర్ పిక్చర్స్ పతాకంపై శ్రీకాంత్ రెడ్డి ఆసం హీరో గా నటిస్తూ కథ, స్టాంట్స్, సంగీతం, దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “లారి చాప్టర్ -1”. చెన్నై లొయోల కాలేజీ లో డైరెక్షన్ కోర్స్ చేసి హైదరాబాద్ వచ్చి పలు చిత్రాల్లో వివిధ శాఖలలో పని చేసి ప్రావీణ్యం పొందాడు. తర్వాత యూట్యూబ్ లో తన వీడియోలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని మంచి పాపులారిటీ సంపాదించి ఇప్పుడు “లారి చాప్టర్ -1” అనే చలన చిత్రం తో వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం లో హీరోయిన్ గా చంధ్ర శిఖ నటించగా రాఖీ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.

అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ఆసం మాట్లాడుతూ “చెన్నై లొయోల కాలేజీ లో డైరెక్షన్ కోర్స్ చేసిన మొదట యూట్యూబ్ లో నా కెరీర్ ప్రారంభించాను. యూట్యూబ్ లో మంచి వీడియోలు చేశాను, చాలా వ్యూస్ వచ్చాయి, మంచి పాపులారిటీ వచ్చింది. అలాగే చాలా సినిమాలకు వివిధ శాఖలలో పని చేశాను. ఇప్పుడు “లారి చాప్టర్ -1″ అనే సినిమా తో మీ ముందుకు వస్తున్నాను. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు తో పాటు తమిళం, కన్నడ, హిందీ మరియు బెంగాలీ భాషలో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఈరోజు నా చిత్రం లోని మొదటి పోస్టర్ ను విడుదల చేస్తున్నాను. సినిమా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. త్వరలో విడుదల చేస్తాను. నా మొదటి సినిమా అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు